హెచ్1బీ వీసాదారులకు ఊరట
అమెరికాలో భారత్ సహా వివిధ దేశాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారికి తుంపి సర్కార్ భారీ ఊరటనిచ్చింది. పలు కారణాలతో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు తమ వివరణ ఇచుకునేందుకు, అలాగే పత్రాలను సమర్పించడానికి మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ట్రంప్ సర్కార్.
దీంతో హెచ్1బీ, గ్రీన్‌కార్డులకు గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా వివిధ దేశాల నుంచి వలస వెళ్లి అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు కోసం పెట్టుకున్న గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com