మధ్యప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ కే అధికారం : కమల్ నాధ్

మధ్యప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ కే అధికారం : కమల్ నాధ్
X

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాధ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా అని.. మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వస్తాయని.. తద్వారా తిరిగి అధికార పీఠాన్ని దక్కించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. కాగా ఖాళీ అయిన 24 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

రెండు నెలల కిందట కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్‌ రాజ వంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. అయితే ఆ సమయంలో ఆయన వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోయారు. అంతకుముందే వారు తమ పదవులకు రాజీనామా చేశారు.. దీంతో వెంటనే స్పీకర్ కూడా వీరి రాజీనామాలను ఆమోదించారు. దాంతో ఖాళీ ఏర్పడింది.

Tags

Next Story