మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. లాక్డౌన్ మరో రెండు వారాలు..!!

ఖాళీగా కూర్చుంటే మందు మీద మరీ మనసుపోతోందని మందు బాబులు మొత్తుకుంటున్నారు. దాంతో దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ కూడా మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడికి తీవ్రత ఎక్కువగా ఉన్న రెడ్ జోన్ ఏరియాల్లో మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ మేరకు బుధవారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాష్ట్రంలో లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన సడలింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. రెండో విడత లాక్గౌన్ ఈ నెల 7తో ముగుస్తుంది. మరో రెండు వారాలు పొడిగిస్తే 21 వరకు కొనసాగుతుంది. అయితే దీనిపై బుధవారం సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com