దేశంలో గడచిన 24 గంటల్లో 2553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

X
By - TV5 Telugu |4 May 2020 5:11 PM IST
దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 2,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 73 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,533కి చేరింది. ఈ వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,373 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 29453 యాక్టివ్ కేసులు ఉండగా, 11,707 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com