యూఏఈలో కరోనాతో పోరాడి భారత సామాజిక కార్యకర్త పీకే కరీం హాజీ మృతి

యూఏఈలో కరోనాతో పోరాడి భారత  సామాజిక కార్యకర్త  పీకే కరీం హాజీ మృతి

యూఏఈలో కరోనాతో పోరాడి ప్రవాస వ్యాపారి, సామాజిక కార్యకర్త పీకే కరీం హాజీ ప్రాణాలు కోల్పోయారు. రెండు వారాల క్రితం కరీం హాజీ జ్వరం, దగ్గు తో బాధపడ్డారు. దీంతో కుంటుంబ సభ్యులు అతడిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్ళారు. అక్కడ శ్వాబ్ టెస్ట్ చెయ్యగా కరీం హాజీ కి కరోనా అని తేలింది. వెంటనే అతడిని అబుధాబిలోని బుర్జీల్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 రోజులు ఆసుపత్రిలో కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయినట్లు కరీం హాజీ కుమారుడు మహ్మద్ అబ్దుల్ గఫూర్ తెలిపారు.

యూఏఈ లో కరోనా విజృభిస్తుండటంతో అవసరమైన వారికి ఆహారం అందించే కార్యక్రమానికి నాయకత్వం వహించారు పీకే కరీం హాజీ. యూఏఈ యొక్క జాతీయ స్టెరిలైజేషన్ డ్రైవ్ తరువాత ఎమిరేట్‌లో ఆహారం అవసరం ఉన్న 1,000 మందికి ఆహారం అందించే బాధ్యతను కరీం హాజీ తీసుకున్నారు.

62 ఏళ్ళ పి.కె. కరీం హాజీ, ఫిబ్రవరి 20, 1974 న యూఏఈ కి వెళ్లారు. యూఏఈ ఎయిర్ఫోర్స్ (అబుధాబి) లో డ్రైవర్ గా తన వృత్తిని ప్రారంభించారు. తరువాత హాజీ ముస్సాఫాలో తన సొంత సూపర్ మార్కెట్ ప్రారంభించడానికి వ్యాపార లైసెన్స్ తీసుకొని ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు. అబుధాబి కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (KMCC) మాజీ అధ్యక్షుడు అయిన హాజీ కు భార్య, ముగ్గురు కుమారులు మరియు నలుగురు మునుమనవళ్లు. హజీ ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ మరియు సున్నీ సెంటర్‌ లో చురుకైన కమ్యూనిటీ వర్కర్ గా అందరి మన్నలను అందుకున్నారు.

హాజీ మృతి పట్ల అబుధాబి KMCC అధ్యక్షుడు షుకూర్ అలీ కల్లుంగన్, పలువురు ఉన్నతాధికారులు హాజీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story