రాజస్తాన్ వలస కార్మికుల బస్సుకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ నుంచి రాజస్తాన్‌ వెళ్తున్న వలస కార్మికులు ప్రమాదం భారీ నుంచి తప్పించుకున్నారు. దాదాపు 40 మంది వలస కూలీలతో వెళ్తున్న బస్సు నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దాంతో డ్రైవర్‌కు గాయాలు కాగా, ఇతర ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ప్రమాదం గురించి తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రాజస్తాన్‌ వాసులకు భోజన ఏర్పాటు చేశారు. అనంతరం వారిని మరో బస్సులో రాజస్థాన్ కు తరలించినట్టు తెలుస్తోంది.

Tags

Next Story