క్వారంటైన్ సెంటర్‌లో టిక్‌టాక్ వీడియోలు.. కేసు నమోదు

భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం చూస్తూనే ఉన్నాం.. కేసులు ఇవాళ తగ్గుతాయేమో.. లేదంటే రేపైనా తగ్గుతాయేమోనని ఆలోచిస్తుంటే కొందరికి మాత్రం ఇదేమి పట్టడం లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నా వారి చెవికి మాత్రం ఎక్కలేదు.. క్వారంటైన్ సెంటర్ లో ఏమి చెయ్యాలో పాలుపోకా ఏకంగా టిక్‌టాక్ వీడియోలు చేశారు. పైగా అక్కడ ఉన్నవారంతా కరోనా లక్షణాలుతో క్వారంటైన్ లో చేరిన వారే. ఈ ఘటన ఒడిశాలోని బద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని తిహిడి హై స్కూల్‌లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు.. అయితే సోమవారం ఆరుగురు వ్యక్తులు కలిసి టిక్‌టాక్ వీడియోలు చేశారు.. ఈ వీడియోలో టిక్ టాక్ తోపాటు పలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేయగా, అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇవి చూసిన చాలా మంది వీరి చేష్టలకు మండిపడుతున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వచ్చింది. దీంతో క్వారంటైన్ లో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను ఉల్లంఘించిన కారణంగా వీరిపై కేసు నమోదు చేసినట్లు బద్రక్ పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com