వారం రోజుల పాటు రోజుకు 40 ప్రత్యేక రైళ్లు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

దేశంలో లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎక్కడిక్కడ చిక్కుకుపోయిన వారు.. తమ సొంత ఊరు ఎలా చేరుకోవాలో తేలీక తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఛార్జీల చెల్లింపు వ్యవహారంపై దుమారం తలెత్తెంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే అంశంపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఖర్చులతోనే కార్మికులను తరలించేందుకు వివిధ రాష్ట్రలకు వారంరోజుల పాటు రోజూ 40 ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది. వలస కార్మికుల అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో మాట్లాడిన సీఎం మంగళవారం నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. హైదరాబాద్ నుంచే కాకుండా వరంగల్, రామగుండం, దామరచర్ల, ఖమ్మం నుంచి కూడా ఈ రైళ్లు నడుపనున్నారు. బీహార్, ఒడిషా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com