కరోనా విషయంలో అమెరికా వాదనను తోసిపుచ్చిన ఆస్ట్రేలియా

కరోనా విషయంలో అమెరికా వాదనను తోసిపుచ్చిన ఆస్ట్రేలియా

ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న జంతు మాంసం మార్కెట్ నుండి ఉద్భవించిందని ప్రస్తుతం అందరూ నమ్ముతున్నారు. అమెరికా మాత్రం దీనిని ఉదేశపూర్వకంగానే ల్యాబ్ లలో తయారు చేసినట్టు ఆరోపిస్తోంది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా ప్రధాని కరోనావైరస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

చైనాలోని మాంసం మార్కెట్ నుంచి ఈ వైరస్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మోరిసన్ మంగళవారం చెప్పారు. అయితే దీనిని సమీక్షించాలని ఆయన అన్నారు. అలాగే వైరస్ ప్రయోగశాలలో తయారవుతుందనే యుఎస్ వాదనను కూడా తోసిపుచ్చింది. ఇలా జరగడానికి అవకాశమే లేదని అన్నారు. అయితే, తమ పరిశోధనలు మాత్రం అమెరికాతోనే కలిసి జరుగుతాయని మోరిసన్ చెప్పారు. కాగా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ 6,825 పాజిటివ్ కేసులుండగా.. 5,859 మంది కోలుకున్నారు.. అలాగే 95 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story