పదవికి రాజీనామా చేసిన ఐఎఎస్ అధికారిణి!

పదవికి రాజీనామా చేసిన ఐఎఎస్ అధికారిణి!
X

హర్యానా క్యాడర్ కు చెందిన రాణి నగర్ అనే 2014 బ్యాచ్ ఐఎఎస్ అధికారిని తన పదవికి రాజీనామా చేశారని ఆమెదని భావిస్తున్న ట్విట్టర్ ఖాతా తెలిపింది. ఆమె తన రాజీనామాను హర్యానా ప్రధాన కార్యదర్శి కేశని ఆనంద్ అరోరాకు పంపారని. రాణి ప్రస్తుతం సామాజిక భద్రతా విభాగంలో అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని.. అందులో ఉంది.

కాగా వివిధ ఆంగ్ల వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. ఆమె తన ప్రాణానికి ముప్పుగా పేర్కొన్న ఒక వీడియోను గతంలో పోస్ట్స్ చేశారు. తాజాగా రాజీనామా చేశారు. వ్యక్తిగత భద్రతే రాజీనామాకు కారణంగా ఆమె ఉదహరించారు. ఇదిలావుంటే లాక్డౌన్ అయిన తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తిరిగి తన స్వస్థలమైన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు గత నెలలో ఆమె తన ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక రాణి నగర్ ప్రస్తుతం తన సోదరితో చండీగర్ లో నివసిస్తోంది.

Tags

Next Story