టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు నిర్వహించం : హెచ్‌ఆర్‌డీ

కరోనాస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు లేనట్టే అని తేలిపోయింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు హెచ్‌ఆర్‌డీ ట్వీట్ చేసింది. అయితే పరీక్షలు జరగనున్న తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మాత్రం పరీక్షలు నిర్వహించేముందు ప్రిపరేషన్‌ కోసం పది రోజుల సమయం ఇస్తామని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ లో పేర్కొంది. కాగా పదవ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ ఇప్పటికే రద్దు చేసింది. కరోనా కారణంగా ఎప్పుడో మార్చ్ లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

Tags

Next Story