నిధుల సమీకరణపై ఐసీఐసీఐ బ్యాంక్‌ కసరత్తు

నిధుల సమీకరణపై ఐసీఐసీఐ బ్యాంక్‌ కసరత్తు
X

నిధుల సమీకరణపై దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 9న జరిగే బోర్డు మీటింగ్‌లో నిధుల సమీకరణకు సంబంధించి చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. డెట్‌ సెక్యూరిటీల ద్వారా ఈ నిధులను సమీకరించే అవకాశముంది.

డెట్‌ సెక్యూరిటీలతో పాటు ఎన్‌సీడీలు, బాండ్లు, నోట్స్‌, ఆఫ్‌షోర్‌ సర్టిఫికెట్లు, ఇతర పద్ధతుల్లో నిధులను సేకరించడానికి ఈనెల 9న జరిగే బోర్డుమీటింగ్‌లో చర్చించనున్నట్టు ఇప్పటికే ఎక్స్ఛేంజీలకు బ్యాంక్‌ సమాచారమిచ్చింది. నిధుల సేకరణ ఒకే లావాదేవీ లేదా అంతకుమించిన లావాదేవీల్లో జరిగే అవకాశముంది. నిధులను ప్రజల నుంచి లేదా ప్రైవేట్ ప్లేట్‌మెంట్‌ ద్వారా సేకరించనున్నారు.

Tags

Next Story