ఇంటి అద్దె వసూలుపై కీలక తీర్పు వెలువరిచిన సుప్రీం కోర్టు

ఇంటి అద్దె వసూలుపై కీలక తీర్పు వెలువరిచిన సుప్రీం కోర్టు
X

లాక్ డౌన్ సమయంలో ఇంటి అద్దె కట్టాలని, లేకపోతె ఇల్లు ఖాళీ చేయాలని బలవంతం చేయకుండా ఉండేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ ఆదేశాలను కోర్టులు అమలు చేయలేవని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విదించడంతో.. వలస కూలీలు, విద్యార్థులు ఇంటి అద్దెలు కట్టే పరిస్థితుల్లో లేరని.. వారి దగ్గర బలవంతంగా అద్దెలు వసూలు చేయవద్దని కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని.. కేంద్రాన్ని, సుప్రీం కోర్టు ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈ బెంచ్‌లో జస్టిస్ ఎస్‌కే కౌల్, బీఆర్ గవాయ్ కూడా సభ్యులుగా ఉన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటికే దీనిపై ఓ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉందనీ.. దీని ద్వారా వ్యక్తులు నేరుగా అధికారులను సంప్రదించవచ్చునని సుప్రీం పేర్కొంది.

Tags

Next Story