ఢిల్లీలో సమయం పూర్తి కాకుండానే మద్యం దుకాణాల మూసివేత.. కారణం ఇదే..

సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 40 రోజుల విరామం తర్వాత తెరిచిన అనేక ప్రభుత్వ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాల్సి వచ్చింది, దీనికి కారణం అవుట్‌లెట్ల వెలుపల భారీగా ప్రజలు గుమిగూడటమే అని తెలుస్తోంది. ప్రజలు సామాజిక దూర నిబంధనలను పాటించకుండా మందుకోసం ఎగబడ్డారు.. కనీసం మాస్కులు ధరించకుండా ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఒకానొక సమయంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.. చేసేదేమి లేక అర్ధాంతరంగా షట్టర్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా దాదాపు 40 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ప్రజలు మద్యం షాపుల వద్ద ఉదయం పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. ఇదిలావుంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఇచ్చిన తాజా లాక్‌డౌన్ సడలింపులకు అనుగుణంగా ప్రభుత్వం నడుపుతున్న 150 మద్యం దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 వరకు తెరవాలని నిర్ణయించుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com