పోలీసులపై వసల కార్మికుల రాళ్ల దాడి

పోలీసులపై వసల కార్మికుల రాళ్ల దాడి
X

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో వలస కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ వారెలి ప్రాంతంలోని వలస కూలీలు సోమవారం వీధుల్లోకి వచ్చారు. పోలీసులు, కార్మికుల మధ్య జరిగిన వాగ్వవాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో కార్మికులు పోలీసులపై రాళ్ళు విసిరారు. ఆ తర్వాత పోలీసులు లాఠీలను ఉపయోగించాల్సి వచ్చింది. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు, అంతేకాదు టియర్‌గాస్ షెల్స్‌ను కూడా కాల్చారు.

సూరత్‌లో వస్త్ర, వజ్రాల పరిశ్రమలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కార్మికులు గుజరాత్‌కు వస్తూ ఉంటారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వారందరూ అక్కడే చిక్కుకుపోయారు. కార్మికులు తమకు ఆహారం దొరకలేదని ఆరోపించారు. ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఏదో ఒకవిధంగా కార్మికులను ఒప్పించి వారిని శాంతింపజేశారు. కాగా ఇక్కడ వజ్రాల పరిశ్రమలో సుమారు 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.

Tags

Next Story