ముగ్గురు భారతీయ ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు పులిట్జర్ అవార్డు

ముగ్గురు భారతీయ ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు పులిట్జర్ అవార్డు
X

జర్నలిజం రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డు భారతదేశానికి చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లను వరించింది. అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్ ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది కశ్మీర్ లోయలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో జరిగిన హింసాకాండపై వీరు తమ కెమెరాల్లో పలు చిత్రాలను బంధించారు. వీరు ముగ్గురు కశ్మీర్ లోయలోని నిరసనకారులు, భద్రతా దళాలకు సంబంధించిన ఫోటోలను ప్రపంచానికి చూపించారు. పులిట్జర్ అవార్డులను వార్తాపత్రికలు, ఆన్‌లైన్ పత్రికా రచన, సాహిత్యం, సంగీత స్వర రచన వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రధానం చేస్తారు.

Tags

Next Story