మేడమ్ సోనియా.. ఇండియాని ఇటలీగా మార్చేస్తారా ఏంటి..

కరోనా వైరస్‌ని కట్టడి చేద్దామనే శ్రద్ధ ఏ మాత్రం కనిపించడం లేదు ప్రభుత్వానికి.. అసలే ఊరెళ్లే మార్గం లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీల దగ్గర టికెట్ డబ్బు వసూలు చేస్తారా అని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి కూలీలను తరలించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు పిలుపునిచ్చారు. సోనియా మాటల్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ నేతలు అసలు రైల్వే కౌంటర్లలో టికెట్ ఇవ్వడం లేదని పేర్కొంది.
టికెట్లు ఇవ్వడం మొదలు పెడితే ప్రజలంతా కౌంటర్ల వద్దే గుమికూడతారని, దాంతో కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందని అన్నారు. ఇటలీలో వైరస్ విస్తరిస్తున్నట్లే ఇండియాలో కూడా కేసుల సంఖ్య పెరగాలని కోరుకుంటున్నారా అని సోనియాను ప్రశ్నిస్తున్నారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఐటీ సెల్ అధికారి అమిత్ మాలవీయ.
వలసకార్మికులను సొంత ఊళ్లకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ఖర్చు 85శాతం కేంద్రం భరిస్తే రాష్ట్రప్రభుత్వాలు 15 శాతం చెల్లిస్తున్నాయి. భారతదేశం కోవిడ్-19ను సమర్థవంతంగా నియంత్రిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని మాలవీయ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com