కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. దీంతో కిక్కెక్కించే ఏదోఒకటి దొరికితే చాలని భావించి ఏది పడితే దానిని తాగేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. భారత్‌లోనే కాదు.. అన్ని దేశాల్లో మద్యం ప్రియులది ఇదే పరిస్థితి. తాజాగా నేపాల్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మత్యువాతపడ్డారు.
మృతులంతా మహోత్తరి జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు చెందినవారు. అయితే, వారంతా కల్తీ మద్యం సేవించడంవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపించామని, ఆ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వస్తే వారి మరణాలకుగల కారణం ఎమిటో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. చనిపోయిన అందరిలోనూ ఒకే రకమైన ఆనారోగ్య లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. అందరూ కడుపులో నొప్పి, డయేరియా, వాంతులతో బాధపడ్డారని అన్నారు. వారంతా స్థానికంగా తయారయ్యే కల్తీ మద్యం తాగినట్లు అధికారులు గుర్తించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com