ఆటో డ్రైవర్ల అకౌంట్‌కు రూ.5,000 ట్రాన్స్‌ఫర్..

ఆటో డ్రైవర్ల అకౌంట్‌కు రూ.5,000 ట్రాన్స్‌ఫర్..
X

లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లతో పాటు నాయీ బ్రాహ్మణులకు రూ.5వేలు ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఒకేసారి ఈ అమౌంట్‌ను వారి అకౌంట్‌కి బదిలీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అలాగే పూల వ్యాపారస్తులు లాక్డౌన్ కారణంగా వారి పంటను నష్టపోయారు. వీరికి కూడా హెక్టారుకు రూ.25లు పరిహారం ఇవ్వబడుతుందని తెలిపింది. హర్టీకల్చర్ రైతుల కోసం కూడా ఓ ప్యాకేజీని ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెద్ద పెద్ద పరిశ్రమలకు రెండు నెలల పాటు కరెంటు బిల్లు చెల్లింపులు వాయిదా వేశారు. నెకార్ సమ్మన్ యోజన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దీని కింద నేత కార్మికులకు ప్రతి సంవత్సరం రూ.2,000 ఆర్థిక సహాయం అందించనుంది.

Tags

Next Story