అంతర్జాతీయం

ఆస్పత్రుల్లో అన్నీ కరోనా కేసులే.. బీపీ, షుగర్ గాయబ్..

ఆస్పత్రుల్లో అన్నీ కరోనా కేసులే.. బీపీ, షుగర్ గాయబ్..
X

వారానికి ఒక్క రోజైనా ఇంట్లో ఉండకుండా ఏమిటా పన్లలంటే ఏవో సాకులు.. కరోనా పుణ్యమా అని నెల రోజుల పైగా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇంట్లో వండిందే తింటున్నారు. బయటి ఫుడ్డు లేదు.. లేట్ నైట్ నిద్ర లేదు. బద్దకం అసలే లేదు. అందరూ ఇంట్లో ఉంటున్నారు. సమయ పాలన పాటిస్తున్నారు. ఒక్క వాహనమూ తిరక్క బయట పొల్యూషనూ లేదు.

దాంతో ఆరోగ్యమూ బావుంటుంది. వర్క్ టెన్షన్ లేకపోవడంతో బీపీ, షుగర్లతో హాస్పిటల్‌కి వెళ్లే వాళ్లూ కరువయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులన్నీ దాదాపు ఖాళీగా ఉంటున్నాయి. ఒక్క కరోనా పేషెంట్లు తప్ప మరో మానవుడు ఆస్పత్రి పరిసరాల్లో కనిపించట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఆస్పత్రి చూసినా గుండెజబ్బుల వారు లేదంటే క్యాన్సర్ రోగులతో కిటకిటలాడుతుండేవి. అలాంటిది కరోనా పేరుతో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.

స్పెయిన్‌లోని 71 కార్డియాక్ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం ఓపెన్ హార్ట్ సర్జరీ కేసులు 81 శాతం తగ్గిపోయాయి. అమెరికాలో 38 శాతం తగ్గింది. ఇక భారత్ విషయానికి వస్తే ఆయా సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 20 శాతం తగ్గిందని నేషనల్ హెల్త్ అథారిటీ డేటా ప్రకారం స్పష్టం అవుతోంది. గుండె జబ్బుల చికిత్సలు 76 శాతం తగ్గాయి. వాహనాల రాకపోకలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES