సర్కార్ కొత్త రూల్.. ఒంటి గంట నుంచి ఆరింటి వరకు డోర్ డెలివరీ..

మీరు రావాలా ఏంటి.. ఒక్క ఫోన్ కొడితే చాలదూ.. క్షణాల్లో మీముందుంటుంది ఫుల్ బాటిల్ అంటోంది పంజాబ్ ప్రభుత్వం. ఏంటో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. అసలే నలభై రోజుల తరువాత దుకాణాలు ఓపెన్ చేశారు కదా అని తోసుకుని రాసుకుని అయినా తెచ్చుకుందాం అనుకుంటే కరోనా వల్ల సామాజిక దూరం పాటించాలని రూల్ పెడుతు న్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనాని లెక్క చేయకుండా మద్యం షాపుల ముందు బారులు తీరడం సర్కారుని కలవరపాటుకు గురిచేసింది.
దీన్ని కట్టడి చేసే నిమిత్తం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయని, ఒంటి గంట నుంచి సాయింత్రం 6 గంటల వరకు మాత్రం డోర్ డెలివరీకి అనుమతిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. నిబంధనలు పాటించకపోతే మద్యం షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని స్ట్రిక్ట్‌గా రూల్ పెట్టారు. ఇక ఛత్తీస్‌ఘడ్‌లోనూ గ్రీన్‌జోన్లలో ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు కొనసాగించవచ్చని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com