మద్యం ఎంత పనిచేసింది.. మత్తులో ఉండి పాముని..

మద్యం ఎంత పనిచేసింది.. మత్తులో ఉండి పాముని..
X

తాగిన మైకంలో తానేం చేస్తాడో తెలియదు మనిషికి. నెల రోజుల నుంచి మందు బాటిల్ ముట్టలేదు. ఒక్కసారిగా బార్ షాపులు ఓపెన్ చేసేసరికి మద్యం దుకాణాల ముందు జనం బారులు తీరారు. కర్ణాటకకు చెందిన కుమార్ అనే వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో దుకాణానికి వెళ్లి మద్యం బాటిల్ కొనుక్కుని బండి మీద వస్తున్నాడు. ఇంతలో ఓ రక్తపింజర బండికి అడ్డుగా వచ్చింది. అప్పటికే మందు ఓ రౌండ్ వేసినట్టున్నాడు. దాంతో దాని మీద నుంచే బండి పోనించాడు. బండి దిగి దాన్ని మెళ్లో వేసుకున్నాడు. అంతటితో ఆగక దాన్ని పరపరా నమిలాడు.

అది చూసిన గ్రామస్తులు అతడి చర్యలకు విస్తుపోయారు. కొందరు అతడి వింత ప్రవర్తనను ఫోన్లలో బంధించారు. గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు కుమార్‌ని విచారించగా.. తన బండికి పాము అడ్డొచ్చేసరికి కోపం వచ్చిందని దాంతో దాని మీదకి బండి ఎక్కించానని అన్నాడు. అయినా ఆ పాముకు విషం ఉంటుందని తనకు తెలియదని అన్నాడు. మద్యం మత్తు బాగా తలకెక్కినట్టుంది. పాము విషం వళ్లంతా పాకితే ఛస్తాడని భావించిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story