తెలంగాణలో ఈదురుగాలుల‌తో కూడిన వానలు : వాతావరణ శాఖ

తెలంగాణలో ఈదురుగాలుల‌తో కూడిన వానలు : వాతావరణ శాఖ
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలుల‌తో కూడిన వానలు పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు బీహార్ నుంచి ద‌క్షిణ ఇంటిరియ‌ల్ త‌మిళ‌నాడు వ‌ర‌కు ఆగ్నేయ మ‌ధ్య‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, రాయ‌ల‌సీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తుల ఉప‌రిత‌ల ద్రోణి ఆవ‌రించి ఉందని వివరించారు. దీని ప్ర‌భావంతో బుధ, గురు వారల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని, వ‌డ‌గండ్లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. పిడుగులు కూడా ప‌డే అవ‌కాశం ఉంది వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Tags

Next Story