వైరస్‌ని ఎదుర్కోవాలంటే..

వైరస్‌ని ఎదుర్కోవాలంటే..
X

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే రోగాలు త్వరగా వస్తాయి. అందునా వైరస్‌కి సంబంధించిన వ్యాధులు మరీ ఇబ్బంది పెడతాయి. పక్కవాళ్లు తుమ్మినా, దగ్గినా ఈజీగా అంటుకుంటుంది. అందుకే రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతో పాటు మంచి నిద్ర కూడా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అంటున్నారు అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ. అంతర్జాతీయ జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని చెప్పింది. మానవ శరీరం బైట నుంచి దాడి చేసే సూక్ష్మ జీవుల బారి నుంచి తట్టుకునేలా నిర్మితమై ఉంటుంది.

శరీరంపై ఉండే చర్మం బ్యాక్టీరియా, వైరస్ లాంటివి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి. అయినా సరే బలవంతగా ప్రవేశించే కొన్ని వైరస్‌లను రక్తంలోని యాంటీ బాడీస్ (రోగనిరోధక శక్తి) గుర్తించి చంపేస్తాయి. వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా అభివృద్ధి చెందిన యాంటీ బాడీస్ రక్తంలోని ప్లాస్మాలో కొన్ని సంవత్సరాల పాటు మనుగడ సాగిస్తాయి. అయినా కొన్ని సూక్ష్మజీవులు బ్రతికే ఉంటాయి. వాటి ద్వారానే అంటురోగాలు వస్తాయి. మరి ఈ యాంటీ బాడీస్ సక్రమంగా పని చేయాలంటే మంచి ఆహారంతో పాటు నిద్ర కూడా అవసరమని చెబుతున్నారు నిపుణులు.

Tags

Next Story