మేలోనే టెన్త్‌ పరీక్షలు : సీఎం కేసీఆర్

మేలోనే టెన్త్‌ పరీక్షలు : సీఎం కేసీఆర్

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన టెన్త్‌ పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మార్చిలో మూడు పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలమేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

పరీక్షల్లో భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పదో పరీక్షల నిర్వహణకు ఉన్న 2,500 సెంటర్లను అవసరమైతే 5 వేలకు కూడా పెంచుతామని వివరించారు. ఇంకా అవసరమైతే 5500 చేస్తాం అని కేసీఆర్ తెలిపారు. పదో తరగతికి మిగిలిన 8 పరీక్షల పేపర్లను ప్రతి హాల్లో 10 నుండి 15 మంది ఉండే తీరుగా భౌతిక దూరం పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటామని వెల్లడించారు. విద్యార్థుల రవాణా కోసం ఆర్టీసీ బస్సులను సైతం నడుపుతామని చెప్పారు. ధనవంతుల పిల్లల విషయంలో వారికి కార్ల పాసులు కూడా జారీ చేస్తామని వెల్లడించారు.

అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు నడచుకుంటామని వివరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ అడ్వకేట్ జనరల్‌కు వివరించామని, హైకోర్టు తదుపరి విచారణలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని అనుకూలంగా జరిగితే మే నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేయిస్తామని సీఎం పేర్కోన్నారు.

Tags

Next Story