ముందు ఆకలికి వ్యాక్సిన్ కనుక్కోండి: విజయ్
By - TV5 Telugu |6 May 2020 1:37 PM GMT
దాదాపు 45 రోజులుగా లాక్డౌన్ పేరుతో దేశంలోని ప్రజలంతా ఇళ్లలో ఉంటున్నారు. దీనిపై తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతి స్పందించారు. రోజు వారి కూలీలు చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో పస్తులు పడుకుంటున్నారు. అక్కడక్కడా ఆకలి చావులు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కరోనా మహమ్మారిని తరిమిటకొట్టడానికి కాదు కనుక్కోవలసింది ఆకలిని కంట్రోల్ చేసే వ్యాక్సిన్ కనుక్కోండి అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కాగా, తమిళంలో వైవిద్యమైన పాత్రల్లో నటిస్తున్న విజయ్ తెలుగులోనూ చిరంజీవి 'సైరా' చిత్రంలో నటించి మెప్పించారు. మరో చిత్రం వైష్ణవ్ తేజ్ నటించనున్న ఉప్పెన చిత్రంలో విజయ్ కీలకపాత్ర పోషించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com