ఆ రెండు రాష్ట్రాలపైనే కేంద్రం దృష్టి

దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ గుజరాత్, మహారాష్ట్రాల నుంచి కేసులు ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రభావిత రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు రాకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే వెయ్యి కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పాజిటివ్ కేసులు, మరణాల దృష్ట్యా పాలు, మందుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ వారం రోజుల పాటు మూసివేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దేశీయంగా దీని లభ్యతను పెంచడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com