టేబుల్ ఫర్ వన్.. ఇకపై రెస్టారెంట్లు ఇలానే..!!

టేబుల్ ఫర్ వన్.. ఇకపై రెస్టారెంట్లు ఇలానే..!!

హడావిడిగా సాగుతున్న జీవన విధానాన్ని ఆర్డర్‌లో పెట్టడానికే కరోనా వచ్చిందేమో. నలుగురు కలిసి రెస్టారెంట్‌కి వెళ్లే పరిస్థితి ఇకపై ఉంటుందో లేదో. దీన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి అన్న నియమావళిని అనుసరిస్తూ స్వీడన్‌లో ఓ రెస్టారెంట్ వెలిసింది. ఒక్కరి కోసమే టేబుల్.. ఒక్కరూ కూడా సర్వ్ చేయడానికి ఉండరు.

కిచెన్ నుంచి నేరుగా తాడు ద్వారా ఓ బుట్టలో ఆర్డర్ చేసిన ఆహారాన్ని అందిస్తారు. ఇక్కడ గదులు, గట్రా ఏమీ ఉండవు. హాయిగా బయట గార్డెన్‌లో ఓ కుర్చీ ఓ టేబుల్ ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ రుచికరమైన వేడి వేడి భోజనాన్ని లాగించడమే. ఎంత తింటే అంత పెడతారట. రేటు కూడా రీజనబుల్‌గానే ఉంటుందట. మే 10 నుంచి ఈ రెస్టారెంట్ ఓపెన్ అవుతుందని అంటున్నారు టేబుల్ ఫర్ వన్ రూపకర్తలు రాస్మస్ పర్సన్, లిండా కార్ల్‌సన్ దంపతులు. వారిద్దరికీ వచ్చింది ఈ ఐడియా.

ప్రపంచంలోనే ఏకైక కరోనా సురక్షిత రెస్టారెంట్‌గా మారుస్తామని లిండా పేర్కొంది. ఈ రెస్టారెంట్‌కు అందరూ ఆహ్వానితులే అని చెబుతున్నారు. కాగా, ఇక్కడ లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికి సామాజిక దూరాన్ని పాటిస్తూ పాఠశాలలు, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకోవచ్చని చెప్పింది ప్రభుత్వం. అయితే సామాజిక దూరాన్ని తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story