మే 20వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు

కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా భయాందోళన నెలకొంది. ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన పరీక్షలు నిర్వహించనున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. గోవా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, గోవా బోర్డ్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల తేదీలు నిర్ణయించామన్నారు.
టెన్త్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు. ఇక 12వ తరగతి పరీక్షలు మే 21వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు, పరీక్ష కేంద్రాల్లో బౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com