45 నిమిషాల్లో రూ.5 లక్షలు లోన్..

45 నిమిషాల్లో రూ.5 లక్షలు లోన్..
X

లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ అత్యవసర రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇతర వ్యక్తిగత రుణాలతో పోల్చితే ఈ అత్యవసర రుణాలపై వడ్డీరేటు కూడా తక్కువగా ఉంటుంది. 10.5 శాతం వడ్డీ రేటుకే ఈ రుణం లభిస్తుంది. మరో ముఖ్యవిషయం రుణం తీసుకున్న 6 నెలల తరువాత నుంచి ఈఎంఐలు చెల్లించవచ్చు. ఈ రుణం పొందాలనుకునేవారు వీలునుబట్టి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం onlinesbi.com లేదా sbi.co.inకి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

Tags

Next Story