ఆంధ్రప్రదేశ్

బ్రేకింగ్.. విశాఖలో మళ్లీ స్వల్పంగా గ్యాస్ లీక్!

బ్రేకింగ్.. విశాఖలో మళ్లీ స్వల్పంగా గ్యాస్ లీక్!
X

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో వందలాది మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పాలీవినైల్‌ క్లోరైడ్‌ గ్యాస్‌ లీకై ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వందల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో మళ్లీ స్వల్పంగా కెమికల్ వాసన వస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ పక్కనే మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ ఉండడంతో నీటి పైన కూడా దీని ప్రభావం ఉంటుందని స్థానికులు భయపడుతున్నారు.

Next Story

RELATED STORIES