విశాఖ గ్యాస్‌ లీక్‌.. వాటర్‌ స్ప్రే చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది : ఏపీ డీజీపీ

విశాఖ గ్యాస్‌ లీక్‌.. వాటర్‌ స్ప్రే చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది : ఏపీ డీజీపీ
X

విశాఖలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఫ్యాక్టరీలో న్యూట్రలైజ్‌ ఉన్నా ఎందుకు వాడలేదు అనేది విచారిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్‌ టీమ్‌ వివరాలు సేకరిస్తోందన్నారు. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ సాధారణ స్థితికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది విచారణలో తేలుతుందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాద స్థలంలో యాంటీ డోస్‌గా వాటర్‌ స్ప్రే చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని గౌతం సవాంగ్‌ తెలిపారు. గ్యాస్‌ లీక్‌పై మొదటగా డయల్‌ 100కు కాల్‌ వచ్చింది. తర్వాత వెంటనే సహాయ చర్యలు చేపట్టాం అని వివరించారు. పోలీసులు సత్వరం స్పందించి స్థానికులను రక్షించారు. మైకుల ద్వారా ప్రకటన చేసి స్థానికులను అప్రమత్తం చేశాం. గాలిలో వాటర్‌ స్ప్రే చేశాం. అదే యాంటీ డోస్‌గా పనిచేసిందన్నారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది ఉన్నారన్నారు. కంపెనీ ఉద్యోగులు ఎవరూ చనిపోలేదన్నారు.

Tags

Next Story