ఉదయం విశాఖలో.. సాయింత్రం ఛత్తీస్‌గడ్ పేపర్ మిల్లులో..

ఉదయం విశాఖలో.. సాయింత్రం ఛత్తీస్‌గడ్ పేపర్ మిల్లులో..
X

ఛత్తీస్‌గడ్ రాష్ట్రం రాయ్‌గర్‌లోని ఓ పేపర్ మిల్‌లో ట్యాంక్ క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో మిల్లులో పని చేస్తున్న ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు రాయ్‌గర్ ఎస్పీ తెలిపారు. బాధితులను కలెక్టర్ యశ్వంత్ కుమార్, ఎస్పీ సంతోష్ సింగ్ పరామర్శించారు. ఘటన గురించి అధికారులు ఆరా తీయగా.. పేపర్ మిల్ యజమాని ఘటనను దాచే ప్రయత్నం చేశాడని, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఎస్పీ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం జరిగిన ఏపీ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 10 మృతి చెందగా, వందల మంది బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story