ఎల్జీ పాలిమర్స్ ఘటన.. రూ.50 కోట్లు డిపాజిట్..

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో మొత్తం 11 మంది మరణించగా వందల మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించి ఎల్జీ పరిశ్రమకు నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లు కూడా పాలిమర్స్ సంస్థకు నోటీసులు ఇచ్చాయి. అయితే నష్టపరిహారం కింద 50 కోట్లు డిపాజిట్ చేయాలని ఎల్జీని కోరింది ఎన్జీటీ. కాగా, ఏపీ సీఎం జగన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు, రెండు నుంచి మూడు రోజులు ఆస్పత్రిలో ఉండే వారికి లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ.10వేలు చొప్పున ఆర్థక సాయి అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com