ఎంపీకి కూతురు పుట్టింది.. పేరు కరోనా పెట్టింది

ఎంపీకి కూతురు పుట్టింది.. పేరు కరోనా పెట్టింది
X

దేశంలో కరోనా వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో పుట్టిన తన కుమార్తెకు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి కరోనా అని పేరు పెట్టారు. పశ్చిమ బెంగాల్ హూగ్లీ జిల్లాలో జన్మించిన మా అమ్మాయి ముద్దు పేరు కరోనా అని పెట్టామని అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అపరూప పోద్దార్ తల్లి అయ్యారు. అరంబాగ్ నుంచి అపరూప రెండోసారి ఎంపీగా గెలిచారు. అమ్మాయి పుట్టిన తరువాత అపరూప, ఆమె భర్త.. పాపకి ముద్దు పేరు కరోనా అని పెట్టాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆసక్తికరంగా అపరూపకు కూడా రెండు పేర్లు ఉన్నాయి. అపరూప పోద్దార్‌తో పాటు ఆమెను అఫ్రీన్ అలీ అని కూడా పిలుస్తారు. అపరూప భర్త షకీర్ అలీ మాట్లాడుతూ, మాకు ఇప్పుడు ఒక కుమార్తె జన్మించింది. ఇది మా రెండవ సంతానం. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో పాప జన్మించింది. కాబట్టి మా చిన్నారి ముద్దు పేరు కరోనా అని అన్నారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీని తన కుమార్తెకు అసలు పేరును సూచించమని కోరినట్లు అపురూప చెప్పారు.

Tags

Next Story