టీవీ5పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: అల్లం నారాయణ

టీవీ5పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: అల్లం నారాయణ

టీవీ5 కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయన అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేఛ్చని, భావ ప్రకటన స్వేచ్ఛని హరించేలా జరుగుతున్న సంఘటనలపై మీడియా కలిసి కట్టుగా పోరాడాలని అల్లం నారాయణ అన్నారు. టీవీ5పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story