టీవీ5 కార్యాలయంపై దాడి

టీవీ5 కార్యాలయంపై దాడి

టీవీ5 కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో సెక్యూరిటీ రూమ్ అద్దాలు ధ్వంశం అయ్యాయి. నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్న టీవీ 5ని కొందరు టార్గెట్ చేశారని అనుమానం వ్యక్తం అవుతుంది. టీవీ5 ప్రచురిస్తున్న వార్తలకు భయపడి కొందరు వారి వర్గీయులతో దాడి చేపించారని స్పష్టంగా తెలుస్తుంది. దాడికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే.. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడి జరిగిన విధానం చూస్తే.. ఎవరో కావాలనే దాడి చేశారని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, సీసీ ఫుటేజులు పరిశీలించి దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

https://www.youtube.com/watch?v=C3SkJxFPpIc&feature=youtu.be&fbclid=IwAR1yp1LuTsFpHovXvDuNR4Jn46uI_h4voKQvhiCMa45sSgMvQHq7rU2rj6I

Tags

Read MoreRead Less
Next Story