టీవీ5 కార్యాలయం పై రాళ్ల దాడి పిరికి పంద చర్య: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

టీవీ5 కార్యాలయం పై రాళ్ల దాడి పిరికి పంద చర్య: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
X

హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు బీజేపీ రాష్ట్రా ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. దాడిని ప్రజా స్వామిక వాదులు అందరూ దీన్ని పిరికిపంద చర్యగా బావిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు నేడు సాధారణంగా మారిపోయాయని అన్నారు. మీడియా సంస్థలపై మీడియా ప్రతినిధులపై దాడులు భావ ప్రకటనా స్వేచ్చమీద దాడిగా భావించాలని అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని కోరుతున్నానని ఆయన అన్నారు.

Tags

Next Story