విశాఖ ఘటనపై ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

X
విశాఖ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖరాశారు. ఆ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు. అయితే, మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని.. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయని లేఖలో రాసారు. అటు, గ్యాస్ లీకేజీపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని.. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలని కోరారు. లీకైన వాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతోందని.. కానీ, స్టైరీన్‌తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
