టీవీ5 కార్యాలయంపై దాడిని ఖండించిన సీపీఐ నేత నారాయణ

టీవీ5 కార్యాలయంపై దాడిని ఖండించిన సీపీఐ నేత నారాయణ

టీవీ5 కార్యాలయంపై దాడిని సీపీఐ నేత నారాయణ ఖండించారు. మీడియాపైన, జర్నలిస్టులపైనా దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.

టీవీ 5 ప్రధాన కార్యాలయంపై దాడులు గర్హనీయం: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

ప్రజా సమస్యలను పరిష్కరించే విధానాన్ని చూపించే వేదిక మీడియా అలాంటి మీడియా పై దాడి చేయడం సిగ్గుచేటు.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ప్రతిపక్షం ఏం చేస్తుంది.. ప్రజా సమస్యలు ఏంటి అని వివిధ కోణాల్లో ప్రజలకు తెలియజేసే ఒక వేదిక మీడియా. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షపడేలాగా చర్యలు తీసుకోవాలి. ఇకపై ఇలాంటి చర్యలు ఎక్కడ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

Tags

Read MoreRead Less
Next Story