విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదం బాధాకరం.. కువైట్ అమీర్ సంతాప సందేశం

X
ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నంలో సంభవించిన గ్యాస్ లీకేజీ ప్రమాదం అత్యంత బాధాకరం అని కువైట్ అమీర్ ఓ సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు తమ సానుభూతిని వ్యక్తం చేస్తూ భారతదేశ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్‌కి సందేశం పంపించారు. అమీర్ పంపిన సందేశంలో గురువారం కెమికల్ ఫ్యాక్టరీ లో జరిగిన ప్రాణనష్టం తనను తీవ్రంగా కలచివేసిందని షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంతాప సందేశం పంపిన వారిలో ప్రిన్స్ షేక్ నవ్వఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్, ప్రధాని షేక్ సబాహ్ ఖలీద్ అల్ హాండ్ అల్ సబాహ్ కూడా ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
