మంత్రి బొత్సకి నారాలోకేష్ లేఖ

X
కరోనా నివారణలో పారిశుద్ద్య కార్మికులు తమ ప్రాణాలను పణంగాపెట్టి పనిచేస్తున్నారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పారిశుద్ద్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు లోకేష్ లేఖ రాశారు. పారిశుద్ద్యకార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తన లేఖలో పేర్కొన్నారు. సిఆర్ డీఏ గ్రామాల్లోని కార్మికులకు గత 4, 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం ఆవేదన కల్గించే అంశమన్నారు. పెనుమకా గ్రామంలోని పారిశుద్ద్యకార్మికుల నిరసనను ఈ లేఖకు జతచేస్తున్నామన్నారు లోకేష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
