48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది: గౌతంరెడ్డి

48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది: గౌతంరెడ్డి
X

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి గౌతంరెడ్డి. స్టైరీన్ గ్యాస్ ఉన్న ట్యాంక్ పరిస్థితి, ఇతర ట్యాంక్‌ల పరిస్థితి ఏంటనే దానిపై సమీక్ష చేశారు. ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కొన్ని రసాయనాలు వాడుతున్న విషయాన్ని కంపెనీ టెక్నికల్ సిబ్బంది వివరించారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని వారు తెలిపారు. స్టైరీన్ ప్రస్తుతం గాల్లో తక్కువ మోతాదులోనే ఉందని దానివల్ల ఇబ్బంది ఉండబోదని చెప్పారు. ఏపీలో 86 పెద్ద కంపెనీలను గుర్తించామని, ఆయా చోట్ల భద్రతా ప్రమాణాల్ని పరిశీలించాకే తిరిగి పనులు ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు.

Tags

Next Story