అక్కినేని సమంత @ ఆన్లైన్ క్లాసెస్..

X
ఎదిగినకొద్దీ ఒదిగి ఉండడం అంటే ఏమిటో అక్కినేని వారింటి కోడలు సమంతను చూసి నేర్చుకోవాలి. మంచి పాత్రలు వరిస్తున్నా నటనలో ప్రతి సినిమాకు ఓ మెట్టు పైనే ఎక్కుతున్నా ఇంకా బాగా నేర్చుకోవాలన్న తపనతో లాక్డౌన్ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది ఈ బేబీ. తాజాగా ఓ ద్విభాషా చిత్రానికి సైన్ చేసిన సమంత.. ఖాళీ సమయాన్ని ఆన్లైన్ క్లాసెస్‌కి వెచ్చిస్తోంది. నటనలో మెళకువలు నేర్చుకుంటోంది. బ్రిటీష్ నటి హెలెన్ నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్‌లో సమంత యాక్టింగ్ క్లాసులను నేర్చుకుంటున్నారట. మంచి నటిగా పేరుతెచ్చుకున్నా నటనలో మరింత పరిణతి కనబరచాలనే తపనతో ఆన్లైన్ క్లాసులో జాయినయ్యారు. సమంత ప్రయత్నం అభినందనీయం. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రల్లో ఆమెని అభిమానులు చూడబోతున్నారన్నమాట.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
