టీవీ 5 కార్యాలయంపై రాళ్లదాడిని ఖండించిన చంద్రబాబు, లోకేష్

టీవీ 5కార్యాలయంపై రాళ్లదాడిని మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు పెట్టాలని ఆయన అన్నారు. నిందితులు ఎవరైనా సరే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. మీడియాపై దాడి చేయడమంటే భారత రాజ్యాంగంపై దాడి చేయడం లాంటిదే అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేసి భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని అన్నారు. జర్నలిస్ట్ లపై తప్పుడు కేసులు బనాయించడం, నిజాలు వెల్లడించే మీడియాపై దాడులు హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ నిరంకుశ చర్యలను అందరూ ఖండించాలని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీవీ5 కార్యాలయం పై రాళ్ల దాడి పిరికిబంద చర్య అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు. పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్చని కాపాడటానికి
ముందుకు రావాలని అన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని లోకేష్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com