హైకోర్టు తీర్పు నచ్చలే.. సుప్రీంను ఆశ్రయించిన తమిళ్ సర్కార్

హైకోర్టు తీర్పు నచ్చలే.. సుప్రీంను ఆశ్రయించిన తమిళ్ సర్కార్
X

ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తే ప్రభుత్వానికి తక్కువ ఆదాయం వస్తుంది. అదే దుకాణం ఓపెన్ చేస్తే బోలెడంత బిజినెస్. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఢోకా ఉండదు. తమిళనాడు సర్కారు ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాక్డౌన్ సడలింపులతో మద్యం దుకాణాలు తెరిచి ఒక్కరోజులో రూ.170 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అక్కడ ఏమాత్రం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టలేదు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దుకాణాలు మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్‌లోనే మద్యం అమ్మకాలు సాగించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంపై న్యాయ పోరాటానికి దిగిన రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం త్వరలోనే విచారించనుంది. ఇదిలా ఉంటే శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 600 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Tags

Next Story