ఆరు బయట నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని చిరుత..

ఆరు బయట నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని చిరుత..
X

కర్ణాటకలోని రామనగర జిల్లాలో శనివారం తెల్లవారు జామున మూడేళ్ల చిన్నారిని చిరుత పులి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఎండాకాలం వేడిని తట్టుకోలేక ఆరు బయట నిద్రిస్తున్నారు కుటుంబసభ్యులు మూడేళ్ల చిన్నారితో కలిసి. తెల్లారి లేచాక చూసుకుంటే పక్కలో పిల్లాడు లేడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం అందించారు. తప్పిపోయిన చిన్నారి కోసం పోలీసులతో పాటు తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు.

గ్రామ శివారుల్లో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు పులి జాడలు కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. బాలుడిని పొట్టన పెట్టుకున్న పులి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. అటవీ మంత్రి ఆనంద్ సింగ్ బాలుడి కుటుంబాన్ని సందర్శించి రూ.7.5 లక్షల పరిహారం ప్రకటించారు. బెంగళూరు గ్రామీణ ఎంపీ డికే సురేష్, శాసనసభ్యుడు మంజునాథ్ గ్రామాన్ని సందర్శించి చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రుల్నికలిసి ఓదార్చారు.

Tags

Next Story