కేటీఆర్ టాస్క్.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు అందరూ..

ఈ వేసవి అంతా కరోనా వైరస్ ముచ్చట్లతో గడిచిపోయింది. రాబోయేది వర్షాకాలం. సీజనల్ వ్యాధులని, ప్రాణాంతక వైరస్‌లను మోసుకొస్తుంది. మరి వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ , ఇతర వ్యాధులను అరకట్టడానికి దోమలను లార్వా దశలోనే వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని అన్నారు. దోమల ఆవాస కేంద్రాలైన నీటి నిల్వలను ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు నీటి ట్యాంకర్లను ఖాళీ చేయాలని అన్నారు.
దీన్ని ఓ క్యాంపెయిన్‌గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి గృహాల్లో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేసి శుభ్రం చేసిన తరువాత మళ్లీ స్టోర్ చేసుకోవాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల లార్వా వ్యాప్తిని అరికట్ట వచ్చని ఆయన అన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com