కరోనా ఎఫెక్ట్.. బస్సు రూపుమారుతోందా!

కరోనా పుణ్యమా అని వేళ్లాడుతూ వెళ్లే రోజులు పోతే ఎంత బావుండు. క్రిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం. గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకుంటామో లేదో అన్న సందేహం. దాదాపు 2 నెలల లాక్డౌన్ అనంతరం రోడ్డెక్కించే బస్సుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 29తో లాక్డౌన్ ముగుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు సడలించింది. ఈ పరిస్థితుల్లో బస్సులు నడిపే విషయమై ఈ నెల 15న సీఎం.. ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం జరపనున్నారు.
కాగా, నిరుపయోగంగా ఉన్న బస్సులపై ఆర్టీసీ కొత్త ప్రణాళికలు రచించింది. అన్నీ సింగిల్ సీట్లు ఏర్పాటు చేసి మూడు వరుసలుగా తీసుకువస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 36 సీట్ల స్థానంలో 20 సీట్లను ఏర్పాటు చేశారు. సరికొత్త వ్యూహంతో రోడ్డెక్కే బస్సు కరోనా కేసుల్ని పెంచకుండా ఉండేలా అధికారులు యోచిస్తున్నారు. రోజుకి ఎన్ని సర్వీసులు నడపాలన్నదానిపై కూడా ఓ నిర్ణయానికి వస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com