మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత..
X

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఐసియు విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికార వర్గాలు వివరించాయి. కాగా, 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆర్థికవేత్తగా ప్రఖ్యాతిగాంచిన మన్మోహన్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా దేశానికి సేవలందించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

Tags

Next Story